- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ మర్డర్ కేసులో.. ఇద్దరి అరెస్ట్
దిశ, హన్మకొండ: పెళ్లి జరిగిన నాలుగు నెలలు గడవక ముందే.. అదనపు కట్నం కోసం నరకం చూపించి అతి కిరాతకంగా భార్యను చీరతో గొంతుకు బిగించి హత్య చేసిన భర్త, మామను సుబేదారి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హన్మకొండ ఏసీసీ జితేందర్ రెడ్డి వివరాల ప్రకారం… ప్రకాష్‌రెడ్డిపేటలోని లోటస్ కాలనీకి చెందిన జరుపుల నాగరాజుకు ఈ ఏడాది మార్చి 22న కామారెడ్డి జిల్లాకు చెందినా సంగీత(లలిత) అనే యువతితో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో సంగీత తల్లిదండ్రులు రూ.5లక్షల నగదు ఇతర కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. కానీ నాగరాజు, అతని తల్లిదండ్రులు సంగీతను అదనపు కట్నం కోసం వేదింపులకు గురిచేయ సాగారు. ఈ క్రమంలో నెల 16న మధ్యరాత్రి భార్య భర్తల మద్య గొడవ జరిగింది. నాగరాజు సంగీతను కొట్టి చీరతో గొంతు బిగించి హత్య చేశాడు. తర్వాత చీరకు ఒక వైపు మెడకు కట్టి సీలింగ్ హుక్‌కు వేలాడితీసి సంగీత ఉరి వేసుకున్నట్టుగా చిత్రీకరించాడు. అనంతరం నాగరాజు తండ్రి బాలుతో పరారయ్యాడు. నిన్నసాయంత్రం డబ్బులు బట్టలు తీసుకొని, ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఇంటికి రాగా సమాచారం మేరకు సుబేదారి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఏసీపీ తెలిపారు.