- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ ఐడీలతో ఐపీఎల్‌లోకి ఎంట్రీ.. ఇద్దరు అరెస్టు
దిశ, స్పోర్ట్స్ : బయోబబుల్ వాతావరణంలో జరిగిన ఐపీఎల్ 2021 మ్యాచ్‌లకు బయటి వ్యక్తులను ఎవరినీ స్టేడియంలలోకి అనుమతించలేదు. అయితే గత శనివారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలోకి నకిలీ ఐడీలతో ప్రవేశించారు. వీఐపీ లాంజ్‌లోకి ప్రవేశించిన వీరిని సెక్యూరిటీ ప్రశ్నించగా సరైన సమాధానాలు చెప్పలేదు. దీంతో వాళ్లు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారిని పోలీసులు అరెస్టు చేసి పంజాబ్‌కు చెందిన క్రిషన్ గార్గ్, మనీశ్ కన్సల్‌గా గుర్తించారు. పోలీసులు వారిపై ఐపీసీ, ఎపిడమిక్ డిసీజజ్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వారిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఈ ఘటనతో బీసీసీఐ ఏర్పాటు చేసిన బయోబబుల్‌లో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో అర్దమవుతున్నదని పలువురు విమర్శిస్తున్నారు.