- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎట్టకేలకు తలొగ్గిన ట్విట్టర్.. గ్రీవెన్స్ ఆఫీసర్ నియామకంపై క్లారిటీ
by Shamantha N |
X
న్యూఢిల్లీ : త్వరలోనే భారత్‌లో తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని నియమించనున్నట్టు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ పేర్కొంది. అప్పటి దాకా ఫిర్యాదులను ఇతర అధికారులు పరిష్కరిస్తారని ఢిల్లీ హైకోర్టుకు ట్విట్టర్ తెలిపింది. ‘నూతన ఐటీ నిబంధనల ప్రకారం తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని ఇది వరకే నియమించాం.
దాన్ని లాంఛన ప్రాయం చేయడానికి ఏర్పాట్లు చేస్తుండగానే ఆ అధికారి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ అధికారి స్థానంలో మరొకరిని నియమించే విషయంలో ఫైనల్ స్టేజీలో ఉన్నాం’అని తెలిపింది. తమ సంస్థ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రిజిష్టర్ అయినందున ఈ పిటిషన్‌ను కొనసాగించదగినది కాదని హైకోర్టులో ట్విట్టర్ వాదనలు వినిపించింది.
Advertisement
Next Story