- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కోసం ట్విటర్ సీఈవో జాక్ విరాళం 1 బిలియన్!
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి అనేక సంస్థలు, ప్రముఖులు ఆర్థిక సాయాన్ని ప్రకటించగా, తాజాగా ట్విటర్ సీఈవో జాక్ డోర్సీ అత్యంత భారీ సాయాన్ని ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకునే చర్యల కోసం ఆర్థిక సాయంగా 1 బిలియన్ డాలర్లను ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ మొత్తాన్ని తన ఆర్థిక సేవల సంస్థ ‘స్క్వేర్’ ద్వారా ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. ఈ సంస్థలో తనకు అధిక వాటా ఉన్నందునే ట్విటర్ నుంచి కాకుండా ‘స్క్వేర్’ నుంచి ఆర్థిక సాయం చేస్తున్నట్టు వివరించారు. జాక్ డోర్సీ ఇవ్వనున్న ఈ మొత్తం తన సంపదలో సుమారు 30 శాతం కావడం విశేషం. తను ప్రకటించిన ఆర్థిక సాయం కరోనాపై పోరాటానికి సహాయం చేసేందుకు మొదలుపెట్టిన ‘స్టార్ట్ స్మాళ్ సేవా సంస్థకు పంపిస్తారు. దీని ద్వారా అందించే సహాయ కార్యక్రమాలు పారదర్శకంగా ఉంటాయని చెప్పారు. ఈ సంస్థ నుంచి ఏ ఏ సేవా సంస్థలకు ఈ ఆర్థిక సాయం అందుతుందో ఎవరైనా తెలుసుకునే విధంగా వెబ్‌సైట్ పొందుపరిచినట్టు తెలిపారు.
Tags: Twitter CEO, Jack Dorsey, coronavirus, covid-19, 1 billion,fight against coronavirus