- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్.. పిటిషన్ దాఖలు చేసిన కీలక వ్యక్తి

X
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. వైఎస్ వివేకా మాజీడ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ తర్వాత విచారణ వేగవంతం అయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. ఇదే కేసులో ఇటీవలే గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి తనకు ప్రాణ హాని ఉందంటూ అనంతపురం పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి కావాలనే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గంగిరెడ్డి పిటిషన్‌లో ఆరోపించారు. గంగిరెడ్డి తరుపున సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
Next Story