ఎస్ఐ సూసైడ్ కేసులో ట్విస్ట్..బ్యూటిషియనే..!

by srinivas |
ఎస్ఐ సూసైడ్ కేసులో ట్విస్ట్..బ్యూటిషియనే..!
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడ టు టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్‌కుమార్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో అతని ప్లాట్‌లోనే ప్రియురాలు ఉన్నట్లు తేలింది. 4నెలల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. సోమవారం రాత్రి అతని ప్లాట్‌లోనే ఉన్న బ్యూటిషియన్ సురేఖ ఆత్మహత్య చేసుకుంటానని బాత్‌రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకోవడంతో మద్యం మత్తులో ఉన్న విజయ్‌కుమార్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఇంతలోనే బయటకు వచ్చిన సురేఖ.. విగతజీవిగా పడి ఉన్న విజయ్‌ను చూసి కంగారుపడింది. బ్యూటిషియన్‌ సురేఖ‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం అరెస్ట్‌ చేయనున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన విజయ్‌కుమార్ 2012 ఎస్ఐ బ్యాచ్. హనుమాన్ జంక్షన్‌లో తొలిసారి బాధ్యతలు చేపట్టాడు. ఇదేక్రమంలో నూజివీడుకు చెందిన బ్యూటీషియన్‌తో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలతో అప్పట్లో సస్పెండ్ అయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి విధుల్లో చేరి గుడివాడ సబ్ డివిజన్లలోని పలు స్టేషన్లలో ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏలూరుకు చెందిన యువతిని 4నెలల క్రితం మ్యారేజ్ చేసుకున్నా, భార్యను కాపురానికి తీసుకురాకుండా బ్యూటిషియన్‌తోనే కలిసి ఉంటున్నారు. బ్యూటిషియన్ ఒత్తిడి వల్లే విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story