10th ఎగ్జామ్స్‌కు ‘వీణా వాణీ’ హాజరు

by Shyam |
10th ఎగ్జామ్స్‌కు ‘వీణా వాణీ’ హాజరు
X

దిశ, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఉదయం పది పరీక్షలు ప్రారంభమయ్యాయి.ఈ పరీక్షలకు అవిభక్త కవలలైనా వీణా వాణీలు మధురా నగర్‌లోని ప్రతిభ హైస్కూలులో పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వీణా వాణీ‌లకు పెన్నులు బహుకరించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. వీరిద్దరినీ స్టేట్ హోమ్ సిబ్బంది ప్రత్యేక వాహనంలో పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు వీణా వాణీలను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. కవలల రాకతో పరీక్ష కేంద్రం వద్ద ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది.

Tags: twins veena, vani attend, ssc exams, jubilee hills mla gopinath, pens gifted, all the best

Advertisement

Next Story