- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మాతను పెళ్లి చేసుకుంటేనే రైటర్‌కు క్రెడిట్ కార్డ్‌లో చోటు?
దిశ, సినిమా : క్రెడిట్ కార్డ్ విషయంలో రైటర్స్ నవజోత్ గులాటి, కనికా థిల్లాన్ మధ్య ట్వీట్ వార్.. ఇండస్ట్రీలో నెలకొన్న ఫ్లా సిస్టమ్‌పై చర్చకు దారితీసింది. హీరోయిన్ తాప్సీ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ‘హసీన్ దిల్‌రుబా’ సినిమాకు రైటర్‌గా పనిచేసిన కనిక పేరును క్రెడిట్ కార్డ్స్‌లో హైలెట్ చేశారు. కాగా ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ చూసిన గులాటి దీనిపై కామెంట్ చేశాడు. ప్రొడక్షన్ హౌజ్‌ను పెళ్లి చేసుకుంటే ఇలాంటి క్రెడిట్స్ కచ్చితంగా దక్కుతాయని ట్వీట్ చేశాడు. రచయిత ఆ ప్రొడక్షన్ హౌజ్ కుటుంబ సభ్యుడైతే.. తనను యాక్టర్ – స్టార్ లాగా ట్రీట్ చేస్తారని, దీన్ని గోల్‌గా పెట్టుకోవాలని సెటైర్ వేశాడు. కాగా కనిక భర్త ‘హసీన్ దిల్‌రుబా’ కో-ప్రొడ్యూసర్ హిమాన్షు శర్మ కావడం విశేషం.
ఈ ట్వీట్‌పై స్పందించిన కనిక.. గులాటిపై విమర్శలు గుప్పించింది. ఎందుకు తన పర్సనల్ లైఫ్‌పై కామెంట్ చేస్తున్నారని ఫైర్ అయింది. ఇది క్లాసిక్ సెక్సిస్ట్ కామెంట్ అన్న కనిక.. గులాటి మెదడు ఇంత ఘోరమైన లింగవివక్షతో నిండిపోయిందని మండిపడింది. ముందుగా ఇలాంటి కామెంట్స్ చేసి, తర్వాత జస్ట్ ఫర్ ఫన్ అని కామెడీగా తీసుకోమంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకరిని పెళ్లి చేసుకుంటేనే క్రెడిట్ కార్డ్స్‌లో పేరొస్తుందని అనుకుంటే.. గులాటి ఓ ప్రొడక్షన్ హౌజ్‌తో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత క్రెడిట్ వచ్చిందా ? లేదా? చూపించాలని డిమాండ్ చేసింది. లేదంటే తనకు క్షమాపణలు చెప్పాలని సూచించింది కనిక. కాగా ఈ క్రెడిట్స్ వార్ కాస్తా సెక్సిజంపై చర్చకు దారి తీయగా.. తాప్సీ పన్ను, అనిరుద్ధ గుహా, బెజోయ్ నంబియార్ లాంటి ప్రముఖులు కనికకు సపోర్ట్ చేశారు.
అయితే క్రెడిట్స్ సంబంధించిన విషయాన్ని అనవసరంగా లింగవివక్షకు దారితీసేలా చేస్తున్నారని ఆరోపించిన గులాటి.. ఒక్క ట్వీట్ తనను సెక్సిస్ట్‌గా ఎలా మారుస్తుందని ప్రశ్నించాడు. తన ప్రధాన ఉద్దేశం ప్రతి వ్యక్తీ పనికి తగిన క్రెడిట్ పొందాలనే తప్ప ఎవరిని కించపరచాలని కాదని స్పష్టం చేశాడు. దీన్ని జాతీయ సమస్యగా చిత్రీకరిస్తున్నారని, ఓటీటీలలో అప్పుడే ప్రవేశించిన రచయితలకు క్రెడిట్ ఇచ్చినప్పుడు సినిమాల్లో ఆ పద్ధతి ఎందుకు లేదని ప్రశ్నించాడు. ఈ వివాదం తర్వాత ప్రతీ రచయిత క్రెడిట్ పొందినట్లైతే కనికకు బహిరంగ క్షమాపణలు చెప్తానని, ఈ ప్రక్రియలో తనను విలన్ అన్నా సంతోషంగా స్వీకరిస్తానని చెప్పాడు. కానీ ఇది సెక్సిజం చర్చకు దారి తీస్తే.. తన మాటల్లో ఆ ఉద్దేశం లేదు కాబట్టి తాను మాత్రం వెనక్కితగ్గనని చెప్పాడు. తాను ఫన్ చేసినప్పుడు జోక్‌గా తీసుకునే సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదా? అని ప్రశ్నించాడు. ఒకవేళ తాను ఈ పోరాటం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించినట్లైతే కనికకు కృతజ్ఞతలు అని తెలిపాడు.
కాగా ఈ ట్వీట్ వార్‌పై స్పందించిన ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి రైటర్స్‌కు క్రెడిట్ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అయితే ఇండస్ట్రీ అనేది మార్కెట్ ప్లేస్ అని, రైటర్ కంట్రిబ్యూషన్ సినిమాకు అంతగా లేనప్పుడు క్రెడిట్ ఇవ్వాలా? వద్దా అనేది నిర్మాత చేతుల్లో ఉంటుందని తెలిపారు. ఈ చర్చను స్వాగతించిన ఫిల్మ్ మేకర్ నంబియార్.. ప్రతీ ఒక్కరు అనుసరించాలని కోరారు. అయితే ఇందుకోసం ఇప్పటి వరకూ లేని ఒక వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. క్రెడిట్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నారు డైరెక్టర్ జై మెహతా. ఇది రైటర్ హార్డ్ వర్క్‌ను గుర్తించడమేనని.. అలాంటి వారికి మనీ, పాపులారిటీ ఇవ్వడంలో తప్పులేదన్నారు. వారిని మోటివేట్ చేసేందుకు కూడా ఉపయోగపడుతుందన్నారు.