- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీవీఎస్‌లోనూ వేతనాల కోత షురూ!
దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నట్టు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ టీవీఎస్ మోటార్ కంపెనీ వెల్లడించింది. సిబ్బంది వేతనాల్లో కోత విధిస్తున్నట్టు ప్రకటించిన తొలి టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ కావడం గమనార్హం. మే నెల నుంచి ఆరు నెలల పాటు 20శాతం వేతనాలు తగ్గించాలని సోమవారం ఓ ప్రకటననలో తెలిపింది. అయితే, కార్మిక స్థాయి ఉద్యోగుల జీతాల్లో మార్పేమీ ఉండదని, ఉన్నత స్థాయి ఉద్యోగులకు మాత్రమే ఈ కోత వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. విపత్కర పరిస్థితుల వల్లే ఆరు నెలల పాటు వివిధ స్థాయిల్లో తాత్కాలికంగా జీతాల్లో కోత విధిస్తున్నట్టు టీవీఈస్ మోటార్ కంపెనీ ప్రతినిధి చెప్పారు. వర్క్‌మెన్ స్థాయిలో ఎలాంటి కోత ఉండదని, జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న వారి జీతంలో 5 శాతం, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో 15 నుంచి 20 శాతం కోత ఉండనున్నట్టు ఆయన వివరించారు.
దేశంలోనే మూడో అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ అయిన టీవీఎస్ కంపెనీ మే 6 నుంచి దేశవ్యాప్తంగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. కంపెనీకి మొత్తం నాలుగు ఉత్పాదక కర్మాగారాలున్నాయి. ఇండియాలోని తమిళనాడు హోసూరులో, కర్ణాటకలో మైసూరు, హిమాచల్ ప్రదేశ్‌లో నలగర్ ప్రాంతాల్లో కర్మాగారాలున్నాయి. మరొకటి ఇండోనేషియాలో ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయంగా తయారీతో పాటు, తమ ఉత్పత్తులను మొత్తం 60కి పైగా దేశాలకు ద్విచక్ర వాహనాల ఎగుమతి చేస్తోంది.