- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్న టీవీఎస్, బీఎండబ్ల్యూ!
దిశ, వెబ్‌డెస్క్: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్, ప్రముఖ లగ్జరీ బైకుల తయారీ బీఎండబ్ల్యూ మోటరాడ్ కంపెనీలు కలిసి భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) అభివృద్ధి, తయారీ, ఎగుమతులు చేపట్టనున్నట్టు ప్రకటించాయి. ఇరు కంపెనీలు కలిసి ఈవీ విభాగంలో సమర్థవంతంగా కొనసాగాలని నిర్ణయించినట్టు బుధవారం వెల్లడించాయి.
రాబోయే రెండేళ్లలో తమ మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలపై దృష్టి సారిస్తూ నెక్స్ట్ జనరేషన్ వినియోగదారును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామని టీవీఎస్ మోటార్, బీఎండబ్ల్యూ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ విభాగంలో ఇరు సంస్థలు ప్రత్యేక మోటార్‌సైకిళ్లను తయారు చేస్తాయని, వాటిని అంతర్జాతీయంగా ఎగుమతులు కూడా చేయనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. టీవీఎస్ మోటార్ కంపెనీతో దీర్ఘకాలిక భాగస్వామ్యం, కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా హై-ఎండ్ ఈవీలను తయారు చేయనున్నాం. దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి ఇప్పటికే ఉన్న కొన్ని మోడళ్లను ఈవీలుగా మార్చే అవకాశం ఉంది. బీఎండబ్ల్యూ ఇప్పటికే రూపొందించిన కాన్సెప్ట్‌లను అభివృద్ధి చేయడంపై ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు’ కంపెనీ వెల్లడించింది.