- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పసుపే బంగారమాయే..
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో, పసుపు బోర్డు, మద్దతు ధర కోసం ఇందూర్ జిల్లాలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపుకు బంగారం లాంటి ధర పలుకుతోంది. ఈ నామ్ ద్వారా అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. మంగళవారం ఓ లాట్పసుపు కోసం 18 మంది వ్యాపారులు ఆన్ లైన్ లో కోట్ చేయగా, ప్రతిభ రకం పసుపుకు మాయిశ్చరైజర్ ఉన్నప్పటికీ క్వింటాల్‌కు రూ.6589 ధర పలికింది. ఈ లెక్కన మాయిశ్చరైజర్ ఉన్న ఏసీ 7879 రకానికి మాత్రం రూ.5,400 వరకు పలికింది. ఈ ఏడాది పసుపు ధర రూ.8 వేల వరకు పలుకుతుందని స్థానిక మార్కెట్ అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే 25,591 క్వింటాళ్ల పసుపు రాక..
ఉత్తర తెలంగాణ జిల్లాలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ అతి పెద్దది. ఉత్తర భారతంలోనే అధిక పసుపు పండించినా మార్కెటింగ్ అయ్యేది మాత్రం ఇక్కడ నుంచే. పసుపుకు మద్దతు ధర కల్పించే విషయం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తమ పరిధిలోనికాదని కాలం వెల్లదీస్తున్నాయి. అయినా పసుపు రైతులు పంట పండించడం, సరుకును మార్కెట్‌కు తరలించడం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. గత ఏడాది ఈ సీజన్ లో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు 17 వేల క్వింటాళ్లు మాత్రమే రాగా, ఈసారి మంగళవారం వరకు 25,591 క్వింటాళ్లు వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో మాయిశ్చరైజర్ పసుపు కు అత్యధికంగా రూ.5400 ధర పలికితే, ప్రతిభ, ఎర్ర గుంటూర్ రకాలకు మాత్రం తేమ తక్కువగా ఉన్నా రూ. 6,589 పలుకుతోంది. గత సంవత్సరం అత్యధిక ధర రూ.5 వేలు మాత్రమే పలికిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ఈ సారి ధర రూ.8 వేలు ఖాయం.!
నిజామాబాద్ మార్కెట్‌కు జిల్లా నుంచే కాకుండా జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల నుంచి పసుపు పంట వస్తోంది. ఈ సీజన్ లో పసుపు ధర క్వింటాల్‌కు రూ. 8 వేల వరకు పలకడం ఖాయమని మార్కెటింగ్అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సారి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు నాలుగు లక్షల క్వింటాళ్ల పసుపు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు మద్ధత ధర కోసం పోరాడినా అది కాస్త రూ. 9 వేలు దాటదనే అభిప్రాయాలు ఉన్నాయి. మాయిశ్చరైజర్ పసుపుకు ప్రస్తుత సీజన్ లో రూ. 8 వేల ధర పలకడం రైతులకు శ్రేయస్కరమే. సాంగ్లీ మార్కెట్లో రాజాపూర్ రకానికి మంచి ధర పలుకుతోంది. తెలంగాణ జిల్లాలకు చెందిన అత్యుత్తమ రకమైన పసుపుకు సాంగ్లీ వ్యవసాయ మార్కెట్‌కు ధరలో రూ. వెయ్యి తేడా వరకు ఉంటుంది. కానీ, రవాణా, ఇతర ఖర్చులను పరిగణలోకి తీసుకుంటే నిజామాబాద్ మార్కెట్లో వచ్చిన ధరతోపోలిస్తే పెద్దగా తేడా ఉండదు.
తేమ లేని పసుపును తీసుకురావాలి
మాయిశ్చరైజర్ ఎక్కువ ఉన్న పసుపుకు తక్కువ ధర వస్తుంది. మంచి ధర రావాలంటే పసుపును ఉడకబెట్టిన తరువాత మంచిగా ఆరబెట్టి మార్కెట్‌కు తీసుకురావాలి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కి ప్రతి రోజు క్వింటాళ్ల కొద్దీ పసుపు వస్తోంది. ఈ నామ్ ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. మార్కెట్లో రైతులకు దళారుల బెడద లేకుండా ఏర్పాట్లు చేశాం.
-విజయ్ కిషోర్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి