కంటైన్మెంట్ జోన్‌గా తుర్కపల్లి

by vinod kumar |   ( Updated:2020-04-13 07:54:00.0  )
కంటైన్మెంట్ జోన్‌గా తుర్కపల్లి
X

దిశ, మేడ్చల్: జిల్లాలోని తుర్కపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకడంతో ఆ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించినట్టు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు తుర్కపల్లిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులు, మందులు, ఇతర అవసరాలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలూ పనిచేసేలా చూడాలని తెలిపారు. ఎప్పటికప్పుడు హైపో క్లోరైట్, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిపై కొవిడ్-19 యాక్డు ద్వారా క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా నియంత్రణకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు, డీఆర్‌వో మధుకర్ రెడ్డి, కీసర ఆర్డీవో రవి, ఆర్ అండ్ బీ అధికారి చందర్ సింగ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ నారాయణ, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: turkapally, containment zone, corona, covid 19, collector vasam venkateswarlu, medchal,

Advertisement

Next Story