ఈ రాశి స్త్రీలు.. మూడో వ్యక్తిని జీవితంలోకి రానీయకండి

by Anukaran |   ( Updated:2021-07-12 12:03:30.0  )
Panchangam
X

తేది : 13, జూలై 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ
(నిన్న ఉదయం 8 గం॥ 19 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 8 గం॥ 23 ని॥ వరకు)
నక్షత్రం : మఖ
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 14 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 40 ని॥ వరకు)
యోగము : సిద్ధి
కరణం : గరజ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 4 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 12 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 18 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 2 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 37 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటలకు)

మేష రాశి: సహనంతో వ్యవహరించండి. అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక పట్టుదల తప్పనిసరి. అనవసరమైన గందరగోళం వలన సరైన ఆలోచనలు రావు. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి కాకపోవటం వలన మానసిక అశాంతి. తొందరపడి ఎవరికీ అప్పులు ఇవ్వకండి. ప్రయాణాలలో వస్తువులు డబ్బు జాగ్రత్త. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి. దాని కన్నా మౌనంగా ఉండటం మంచిది ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృషభ రాశి: ఆత్మవిశ్వాసంతో సహనంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్త. కొంతమందికి ప్రమోషన్ కొంతమందికి కావలసిన ప్లేసు కు ట్రాన్స్ ఫర్. ఆదాయ వ్యవహారాలు మెరుగుపడతాయి మరింత డబ్బును పొదుపు చేస్తారు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. వ్యాపారస్తులు అనుభవజ్ఞులైన వారి సలహా తో లాభాలను గడిస్తారు. సమయాన్ని వృధా చేయకండి సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

మిధున రాశి: ఆత్మవిశ్వాసంతో జాగరూకతతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలను ఆత్మీయుల సలహా తో తీసుకోండి. మీ వ్యక్తిత్వంతో అందర్నీ మెప్పిస్తారు. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. ఆఫీస్ పనులను మీ సామర్థ్యము తెలివితేటలను ఉపయోగించి పూర్తి చేయండి. బుద్ధి లేని వారు మాత్రమే చేసిన తప్పులను మరల చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త ఆఫీసు పనిలో ఒత్తిడి వలన మీతో గొడవకు దిగవచ్చు జాగ్రత్త వహించండి.

కర్కాటక రాశి: సరైన ప్రణాళికతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఊహించిన విధంగా విజయం లభించదు దైవ ప్రార్ధన వలన మానసిక బలం ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి లేనిపోని గందరగోళంతో సమయం వృధా. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. మరింత సంపాదన కొరకు నూతన ప్రణాళికలు వేస్తారు. ఆఫీసులో తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒత్తిడిని అధిగమించి పనులను పూర్తిచేయండి. వస్తువులు డబ్బు జాగ్రత్త. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కన్య రాశి: ఈరోజు మీ ఊహలు నిజమవుతాయి. పాత అప్పులను తీర్చడానికి ప్రయత్నిస్తారు. ఒక గుణపాఠంగా ఇంకెప్పుడు అప్పులను చెయ్యటానికి ప్రయత్నించకండి. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కోసం చేస్తున్న ప్రయాణాలు లాభకరం. కుటుంబ సభ్యుల కొరకు కొంత సమయం కేటాయించండి వారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. బంగారు భవిష్యత్తు కోసం సరైన ప్రణాళికలు వేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

సింహరాశి: ఆశావాహ దృక్పథం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. వ్యాపారస్తులు ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను భద్రపరుచుకోండి. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. జాగ్రత్తగా ఆలోచించి సహనంతో పనులు పూర్తి చేయండి. ఆడంబరాల కోసం ఖర్చు పెట్టకండి. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి. వారితో మనసు విప్పి మాట్లాడండి. అధిక శ్రమ వలన గొంతు నొప్పి మరియు తలనొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలు మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

ధనస్సు రాశి: ఈరోజు ఆశలకు రెక్కలు వచ్చిన రోజు. మీ పెట్టుబడులకు తగినంత లాభాలు. దైవప్రార్థన వలన మానసిక బలం. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి వారు హర్ట్ అవుతారు. వారితో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి కావాలంటే మరింత కష్టపడాలి మీ బడ్జెట్ పట్ల జాగ్రత్త వహించండి. బయట భోజనం మానేయండి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల వైవాహిక జీవితంలోకి మూడవ వ్యక్తిని రానీయకండి.

వృశ్చిక రాశి: వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలు వేస్తారు. అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోండి. తోటి ఉద్యోగులతో సామరస్య ధోరణి వలన ఆఫీసులో ఆహ్లాదకర వాతావరణం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యంగా పిల్లలతో గడపటం మీకు ఎంతో ఎనర్జీ. కావలసినంత ధనం చేతికందుతుంది పాత బకాయిలు తీర్చి వేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలు మరిచిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

తులారాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. నెగెటివ్ ఆలోచనలను వదిలివేయండి. ఈ రోజు ఆఫీసు పనులలో చాలా బిజీగా ఉంటారు. కొంతమంది ఉద్యోగ మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. వ్యాపారస్తులు వారు అనుకున్న లాభాలు గడిస్తారు. కావలసినంత ధనం చేతికందుతుంది సరైన పథకాలలో పెట్టుబడులు పెట్టండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు కుటుంబ వ్యవహారాల గురించి ప్రణాళికలు వేస్తారు.

మకర రాశి: ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించకండి ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి లేకుంటే నెగిటివ్ ఆలోచన వలన అనారోగ్యం. ఆఫీస్ పనులను తెలివిగా సరైన ఆలోచనలతో పూర్తి చేయండి. తోటి ఉద్యోగుల, పైఅధికారుల సహాయం లభిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపార రహస్యాలను ఇతరులతో పంచుకోకండి. వ్యాపార విస్తరణ కొరకు అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల కొరకు కొంత సమయం కేటాయించండి ముఖ్యంగా మీ పిల్లల చదువుల ను గమనించండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఇది ఒక ఆనందకరమైన రోజు.

కుంభరాశి: కుటుంబ వ్యవహారాలలో చిన్నచిన్న గొడవలు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. పనులతో సతమత మవుతున్నప్పటికీ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది ఉద్యోగ మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. కొంతమందికి ప్రమోషన్. వ్యాపారస్తులకు వారు ఊహించినంత కాకపోయినా లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోండి ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి: స్వశక్తితో ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఊపిరి సలపని పనులతో విసిగిపోయి ఉన్న మీకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. ఆదాయ వ్యవహారాలు మెరుగుపడతాయి పాత బకాయిలు వసూలవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ మీద అజమాయిషీ చలాయించటానికి జనాలు రెడీగా ఉన్నారు జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక తీపి గుర్తు.

Advertisement

Next Story

Most Viewed