- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భక్తులకు టీటీడీ షాక్: శ్రీవారిని దర్శించుకోవాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి
దిశ, ఏపీ బ్యూరో: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ ఉన్నట్లు సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా..భక్తులు మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మరోవైపు ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు ఎనిమిది వేల చొప్పున సర్వ దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను నిలిపివేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే అక్టోబరు నెలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈనెల 24 నుంచి ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
- Tags
- ap