శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సర్వదర్శనంపై టీటీడీ కీలక ప్రకటన

by Anukaran |   ( Updated:2021-11-27 00:36:41.0  )
TTD
X

దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శనివారం ఉదయం సర్వదర్శన టోకెన్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. సర్వదర్శనంతో పాటు వసతికి సంబంధించిన కోటాను విడుదల చేసిన టీటీడీ.. శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. సర్వదర్శనం టోకెన్లు, వసతి కోసం భక్తులు www.tirupatibalaji.ap.gov.in లో బుకింగ్ చేసుకోవాలని టీటీడీ పేర్కొంది.

డిసెంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శన టోకెన్లను శనివారం ఉదయం 9 గంటలకు విడుదల చేసినట్లు టీటీడీ వెల్లడించింది. రోజుకు 10వేల మంది భక్తులకు టికెట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నెలలో తిరుమలలో వసతికి సంబంధించిన టికెట్ల కోటాను నవంబర్ 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. కాగా, స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. ఇదిలా ఉండగా ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసిన 20 నిముషాల వ్యవధిలోనే 3లక్షల టోకెన్లను భక్తులు బుక్ చేసుకున్నారు. దీంతో డిసెంబర్ నెలలో సర్వదర్శనం టికెట్లు దాదాపుగా అయిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed