- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో లంచగొండి
దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్ఎస్పీడీసీఎల్‌లో డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గజవాడ మనోహర్ రూ.35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని అతడి కార్యాలయంలోనే గురువారం సాయంత్రం అతడు చిక్కినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పరిధిలో బాధితుడు బొల్లారం బాలనరసింహకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్ లో 5 కిలోవాట్ల విద్యుత్ సరఫరా చేయాలని కోరగా మనోహర్ రూ.35 వేలు లంచం డిమాండ్ చేసినట్లు వారు చెప్పారు. బాధితుడు తమను సంప్రదించడంతో రంగంలోకి దిగి నగదు తీసుకునే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా మనోహర్ ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడిని అరెస్ట్ చేసి ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట హాజరు పరుచనున్నట్లు తెలిపారు. అధికారులు లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి తెలపాలని ఏసీబీ అధికారులు సూచించారు