- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా టీఎస్పీఎస్సీ ఫార్మేషన్ డే
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆవిర్భవించి ఏడేండ్లు దాటింది. స్వరాష్ట్రంలో 2014 డిసెంబర్ 18న టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. కమిషన్ చైర్మన్ జనార్థన్‌రెడ్డి ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. టీఎస్పీఎస్సీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయం ఆవరణలో చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని చైర్మన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ మెంబర్లు సుమిత్రా, అరుణాదేవి, సెక్రెటరీ అనితా రామచంద్రన్, టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ, టీజీఓ నగర శాఖ అధ్యక్షుడు డా. గండూరి వెంకటేశ్వర్లు, సుశీల, సరిత, సయ్యద్, శివ, అంజన్, శ్రీమతి, శ్రీధర్, వనమా, సత్యనారాయణ, శకుంతల, శాంతిక్ష, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.