- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధినేతను తలచె.. అధికారులు తరించె!
గతంలో ఏ ముఖ్యమంత్రికీ లేని ఒక ప్రత్యేకత ఈసారి కేసీఆర్‌కు దక్కింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మొదలు ఐఏఎస్లు, ప్రభుత్వవిభాగాల పెద్దలను, వివిధ స్థాయిల్లోని అధికారులను తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించేలా చేశారు. బర్త్డే వేడుకల నిర్వహణలో టీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వెనక్కినెట్టి మరీ అధికారులు అత్యుత్సాహం చూపారు. రెగ్యులర్గా సోమవారం నిర్వహించే ప్రజావాణితోపాటు సాధారణ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కార్యాలయాలను వదిలి రోడ్ల మీద పడ్డారు.
కేసీఆర్ 66 వ పుట్టిన రోజు సందర్భంగా ఒక్కరోజే కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సాధారణంగా ఈ పనిని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేపట్టాలి. గతంలో పనిచేసిన వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడుసహా ఏ ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లోనూ ప్రభుత్వ అధికారులు నేరుగా పాల్గొనలేదు. ప్రత్యేక అభిమానమున్నవారు ఒక్కరిద్దరు వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపేవారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలెవరూ హోర్డింగ్‌లు పెట్టొద్దని, తలా ఒక మొక్కను నాటాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కోరారు. దీన్ని అధికారులు తామే కార్యకర్తలమని భావించారో ఏమోగానీ కేటీఆర్ ఒక్కటి చెబితే తమ పవర్, సిబ్బందిని ఉపయోగించి అంతకు మించి అన్నట్టు వందల్లో, వేలల్లో మొక్కలు నాటారు. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించారు. అధికారులు అనుకుంటే ఎంతటిపనైనా సాధ్యమే అని నిరూపించారు.
సాధారణ పరిపాలనాపనులను సైతం ఆపివేసి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, జిల్లా కలెక్టరేట్లు, మండల పోలీసు స్టేషన్లుసహా అధికారులందరూ మొక్కలు నాటడంలో బిజీ అయిపోయారు. దీంతో అవసరాల కోసం కార్యాలయాలకొచ్చే సాధారణప్రజలు అధికారులులేక, పనులు జరగకపోవడంతో వెనుదిరగక తప్పలేదు. ప్రగతిభవన్లో కేసీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను మించి రాష్ట్రంలోని ఐఏఎస్లు, ఐపీఎస్లు పోటీపడ్డారు.
మరో అడుగు ముందుకేసిన హైదరాబాద్ నగరపాలక సంస్థ 150 వార్డుల్లో మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు గచ్చిబౌలి స్టేడియంలో ‘మియావాకి’ అనే పద్ధతిలో ఒకే రోజు పది వేల మొక్కలు నాటారు. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఒక ఉద్యమంలా చేపట్టి మరే అత్యవసర పనులు లేనట్టు చేసిన ప్రభుత్వ అధికారుల్లో ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ కూడా ఉండటం బాధాకరం. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేని ఓ కార్యక్రమంలో పోటీపడిన అధికారులు ప్రజలకు సేవలందించే విధులను పక్కనపెట్టి పార్టీ కార్యకర్తల స్థాయిలో వ్యవహరించారు. ఇదే సుపరిపాలనగా భావించారు కాబోలు!