ప్రైవేట్ స్కూల్స్ పరిధి దాటొద్దు : విద్యాశాఖ

by Shyam |
ప్రైవేట్ స్కూల్స్ పరిధి దాటొద్దు : విద్యాశాఖ
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ క్లాసులు మినహా విద్యార్థులను కాలేజీలకు, స్కూళ్లకు పిలిపించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రైవేట్ స్కూల్స్ అడ్మిషన్ టెస్టులు నిర్వహించకూడదని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

నారాయణ, శ్రీచైతన్య కళాశాలలు స్కాలర్ షిప్ కం ఎంట్రెస్స్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని విద్యాశాఖ గుర్తుచేసింది. తల్లిదండ్రులు, విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టుపెడితే రూ.2వేల జరిమానా విధిస్తామని.. అయినప్పటికీ మళ్లీ తప్పు చేస్తే రూ.50వేల పెనాల్టీ విధిస్తామని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.

Advertisement

Next Story

Most Viewed