తక్కువ టెస్టులు చేస్తూ ప్రజల్ని మోసగిస్తుండ్రు : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌

by Shyam |
తక్కువ టెస్టులు చేస్తూ ప్రజల్ని మోసగిస్తుండ్రు : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌
X

దిశ, నల్లగొండ: కరోనా పరీక్షలు ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే తక్కువ చేస్తూ ప్రభుత్వం ప్రజల్ని మోసగిస్తున్నదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఐఎన్​టీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణంలో 500 మంది పేదప్రజలకు ఆయన బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే కరోనా టెస్టులు తక్కువ జరుగుతున్నాయని, దానికి కారణం టీఆర్‌ఎస్ సర్కారు పనితీరు అని ధ్వజమెత్తారు.ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఐఎన్​టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 500 మంది పేద ప్రజలకు 60 క్వింటాల బియ్యం, 2క్వింటాల కూరగాయలు పంపిణీ చేశారు. తెల్లరేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికీ రూ. 5వేల ఆర్థిక సాయం అందజేయాలని ఉత్తమ్​ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో ఐకేపీ సెంటర్లలో వసతులు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారని వివరించారు.విపత్కర పరిస్థితుల్లో మామిడి, నిమ్మ, బత్తాయి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల వలసకూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

tags: tpcc president uttam kumar reddy, fire on ts govt, less corona tests

Advertisement

Next Story

Most Viewed