జేసీ పోస్టుకు రాంరాం..

by Shyam |
జేసీ పోస్టుకు రాంరాం..
X

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలనానికి తెరలేపింది. రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పోస్టులను రద్దు చేస్తూ ఆదివారం రాత్రి కీలక ఉత్వర్వులు జారీ చేసింది. ఎన్నో ఏండ్లుగా కొనసాగుతూ వస్తున్న జేసీ పోస్టును రద్దు చేసి దాని స్థానంలో అడిషనల్ కలెక్టర్ పోస్టును తీసుకొచ్చింది. ఐఏఎస్‌లతో పాటు నాన్ కేడర్ అధికారులను ఈ పోస్టుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు ఉండరు. ఆ స్థానంలో అదనపు కలెక్టర్లు పనిచేయనున్నారు. వీరిలో స్థానిక సంస్థలకు ఒకరు, రెవెన్యూ పాలనకు మరొకరు చొప్పున కేటాయించనున్నారు. ఆదివారం రాత్రి భారీగా స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసి, వారికి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. నాన్‌ కేడర్‌ అధికారులైన స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను అదనపు కలెక్టర్లుగా నియమించగా..ఐఏఎస్‌ అధికారులకు అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు)గా పోస్టింగులు ఇచ్చింది. కలెక్టర్ల సదస్సు జరగడానికి 2 రోజుల ముందు హఠాత్తుగా 49మంది అధికారులను బదిలీ చేయడంతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ పోస్టును రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.

Advertisement

Next Story