శ్రీశైలం మృతులకు రూ.కోటిన్నర ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

by Shyam |
శ్రీశైలం మృతులకు రూ.కోటిన్నర ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాద ఘటన మృతులకు రూ.కోటిన్నర చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ కోరింది. ఆ మేరకు అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ ఎన్. శివాజీ జెన్‌‌ కో సీఎండీకీ గురువారం లేఖ రాశారు. విద్యుత్ ప్లాంట్‌ను కాపాడటంలో వారంతా తమ ప్రాణాలను కోల్పోయారని, వారి త్యాగాన్ని గుర్తించాలని అందులో కోరారు. జెన్‌కోకు సంబంధించిన కోట్ల రూపాయల ప్లాంట్, ఆస్తులను రక్షించడంలో మృతిచెందిన వారి కుటుంబాలకు జెన్‌కో అండగా ఉండాలని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఎక్స్‌గ్రేషియాకు అదనంగా జెన్‌కో కూడా ఒక్కొక్కరికి రూ.1.5కోట్ల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఇదే విషయంపై ఆగస్టు 24న కూడా లేఖ రాసినట్టు గుర్తుచేశారు.

Advertisement

Next Story