- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈనెల 31న TS- ECET
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో నిర్వహించాల్సిన ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఈనెల 31న TS-ECET నిర్వహించనున్నట్లు కన్వీనర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. రెండు సెషన్స్ ద్వారా ఈ పరీక్షను నిర్వహిస్తామని.. అందులోనూ కొవిడ్ -19 మార్గదర్శకాలను పూర్తిగా అనుసరించే ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ ఉంటుందని స్పష్టంచేశారు.
అందుకోసం ఏపీలో-4, తెలంగాణలో-52 కలిపి మొత్తంగా 56 పరీక్షా కేంద్రాలను సిద్ధంగా ఉంచామని వివరించారు. ఇక గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కోసం ఆన్‌లైన్‌లో టీఎస్ ఈసెట్ 2020 కోసం శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఇదిలాఉండగా, అభ్యర్ధులు కొత్తగా మంజూరు చేసే హాల్ టిక్కెట్లను ఈ నెల 25 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టీఎస్-ఈసెట్ (TS-ECET) అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కన్వీనర్ హుస్సేన్ తెలిపారు.