- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దోస్త్ దరఖాస్తు గడువు పెంపు
దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ దరఖాస్తు గడువును పెంచుతూ ఉన్నత విద్యామండలి కన్వీనర్ లింబాద్రి ప్రకటన విడుదల చేశారు. ఆశించిన స్థాయిలో దోస్త్‌కు దరఖాస్తులు రాకపోవడం, కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దరఖాస్తు గడువును పెంచుతున్నారు. ఇప్పటి వరకు దోస్త్‌తో 1,88,720 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 1,80,103ను పేమెంట్‌ను చెల్లించారు. మొదటి ఫేజ్ వెబ్ ఆప్షన్లను 1,56,359 మంది విద్యార్థులు ఎంచుకున్నారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని విద్యార్థుల కోసం ఈ నెల 28 వరకు మొదటి విడుత రిజిస్ట్రేషన్ చేసుకునుందుకు అవకాశం కల్పించారు. ఇందుకు అనుగుణంగా వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకునేందుకు కూడా ఈ నెల 28 వరకు గడువును పొడగించారు. ఫస్ట్ ఫేస్ లో సీటు పొందిన విద్యార్థులు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ను ఆగస్ట్ 05 నుంచి 09 వరకు నిర్వహిస్తామని తెలిపారు. సెకండ్ ఫేస్ రిజిస్ట్రేషన్ ను, వెబ్ ఆప్షన్లకు ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 18 వరకు అవకాశం కల్పిస్తున్నట్టుగా ప్రకటించారు. స్పెషల్ క్యాటగిరి విద్యార్థులకు వెరిఫికేషన్‌ను ఆగస్ట్ 13న చేపట్టనున్నారు.