- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐయామ్ ఎక్సైటింగ్ : ట్రంప్
భారత పర్యటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇండియా వెళ్లేందుకు చాలా ఎక్సైటింగ్‌గా ఎదురు చూస్తున్నానని తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే తనదైన శైలిలో చేసిన ట్వీట్ నెటిజన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫేస్‌బుక్ ఫాలోవర్స్‌లో నెంబర్‌వన్ స్థానం ట్రంప్ అయితే నెంబర్ 2లో ప్రధాని మోడీ ఉన్నారని మార్క్‌జుకర్ బర్గ్ తనకు చెప్పాడని అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేశారు. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని కూడా పేర్కొన్నారు. కాగా,ఫిబ్రవరి 24,25తేదీల్లో ట్రంప్ ఇండియా పర్యటన కు రానున్నారు.ఈ పర్యటన వలన భారత్,అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాలు మరింత మెరుగుపడనున్నాయి. ఇండియా ఆర్మీకి సంబంధించి పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకోనున్నట్టు సమాచారం. అంతకుముందు అహ్మదాబాద్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్దదైన మొతెరా క్రికెట్ స్టేడియాన్నిట్రంప్ ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుని పర్యటన కోసం భారత్ సర్కార్ రూ.100కోట్లు ఖర్చుచేయనున్నట్టు సమాచారం.