ఆర్జీవీ మళ్లీ ఏసేశాడు !

by Shyam |
ఆర్జీవీ మళ్లీ ఏసేశాడు !
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా టూర్‌పై డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ మళ్లీ సెటైర్ వేశాడు. ట్రంప్ కేవలం లక్షల మంది జనం తనను ఆహ్వానించారనే ఉద్దేశంతోనే ఇండియాలో విజిట్ చేశాడని అంతకు మించి వేరే ఉద్దేశం లేదని విమర్శలు స్టార్ట్ చేశాడు. పర్యటన ముగిసిన నేపథ్యంలో ట్రంప్ అభిప్రాయం ఏంటి? భారత ప్రధాని మోడీతో దేని గురించి చర్చిస్తాడు? అనే దానిపై వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.

ట్రంప్, మోడీల మధ్య కన్వర్జేషన్:

”ట్రంప్ : మిస్టర్ మోడీ.. నన్ను చూసేందుకు 70లక్షల మంది భారతీయులు వస్తారని చెప్పారు కానీ లక్ష మంది మాత్రమే వచ్చారు కదా.
మోడీ: మిస్టర్ ట్రంపీ .. డాలర్ రూ.70 రూపాయలకు ఎలా సమానమో.. ఒక్కో గుజరాతి 70 అమెరికన్లతో సమానం.”

ఈ ట్వీట్‌తో నెటిజన్లు పడి పడి నవ్వేస్తున్నారు. ఆర్జీవీ సెన్సాఫ్ హ్యూమర్‌కు దండాలు పెడుతున్నారు. ఎపిక్ ఆన్సర్ అని కొందరంటే… ఏం జోక్ ఆర్జీవీ అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. భాషా సినిమాలో ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లు అన్నట్లు .. గుజరాతీలు ఒక్కరు 70 మంది అమెరికన్లతో సమానమా ఆర్జీవీగారు అంటూ ట్వీట్ చేస్తున్నారు.

Advertisement

Next Story