వీళ్లు మారరు.. మీడియాపై ట్రంప్ ఆగ్రహం

by vinod kumar |
వీళ్లు మారరు.. మీడియాపై ట్రంప్ ఆగ్రహం
X

వాషింగ్టన్ :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు, మీడియాకు మధ్య వార్ ఈనాటిది కాదు. ప్రతీ సమావేశంలోనూ మీడియాపై విరుచుకుపడటం ఆయనకు అలవాటైపోయింది. ముఖ్యంగా తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్టు వంటి సంస్థలపై అక్కసు కక్కుతూనే ఉంటారు. తాజాగా ఆయన మీడియాపై మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించారు. ‘అమెరికాలో కరోనాను కట్టడి చేయడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. ప్రపంచంలో మరే ఇతర దేశం కూడా నిర్వహించనన్ని టెస్టులు నిర్వహిస్తూ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నాం. అయినా సరే మీడియా మాత్రం మేం చేసే పనులను గుర్తించడం లేదు. పైగా మాపై ఫిర్యాదులు మాత్రం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. గతంలో వెంటిలేటర్లపై తాము తీసుకున్న చొరవను చెప్పకపోగా, తప్పుడు వార్తలు ప్రసారం చేశారని, ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని మీడియా ఎప్పుడూ చెప్పదని ధ్వజమెత్తారు. మీడియాకు ఎప్పుడూ అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అంటూ ఫిర్యాదు చేయడం తప్ప మరే విషయం తెలియదని.. ఈ మీడియా వాళ్లు ఎప్పటికీ మారరని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags : Coronavirus, Donald Trump, America, President, Media, Fire

Advertisement

Next Story