- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రంప్ క్యాంపెయిన్‌లో మోడీ వీడియో
దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రవాస భారతీయుల ఓట్ల కోసం ప్రచారం ముమ్మరమైంది. ఇందులో భాగంగానే ట్రంప్ క్యాంపెయిన్ టీమ్ శనివారం ఓ వీడియో విడుదల చేసింది. ప్రెసిడెంట్ ట్రంప్‌కే మరో నాలుగేళ్లు పట్టం కట్టపెట్టాలని పేర్కొంటూ విడుదల చేసిన ఆ వీడియోలో హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ కార్యక్రమాల క్లిప్‌లు ఉన్నాయి. ఈ వీడియోలో 2019 హూస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలో మోడీ మాట్లాడిన దృశ్యాలున్నాయి.
‘ప్రెసిడెంట్ ట్రంప్.. మీరు మీ కుటుంబాన్ని నాకు పరిచయం చేశారు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను’ అంటూ ప్రవాస భారతీయులకు డొనాల్డ్ ట్రంప్‌ను పరిచయం చేశారు మోడీ. అలాగే, గుజరాత్‌లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ ప్రోగ్రామ్‌లో మోడీ, ట్రంప్‌లు అభివాదం చేస్తున్న క్లిప్ వీడియోలో కనిపించింది. అమెరికా, భారత్ మధ్య గొప్ప సంబంధాలున్నాయని, తమకు ప్రవాస భారతీయుల మద్దతు గణనీయంగా ఉన్నదని ట్రంప్ విక్టరీ ఫైనాన్స్ కమిటీ నేషనల్ చైర్ కింబర్లీ గిల్‌ఫాయిల్ వ్యాఖ్యానించారు.