- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మీ ఓట్లే కావాలి.. మీరు కాదు : బీజేపీ నేత స్వామిగౌడ్
దిశ, కరీంనగర్ సిటీ : స్థానిక సంస్థలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని బీజేపీ నేత, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇంచార్జి, మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్‌లో బీజేపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు ప్రభుత్వానికి కావాలి. కానీ, ఆ సంస్థలను గాడిలో పెట్టి ఆయా ప్రజాప్రతినిధుల గురించి ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమన్నారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని, అప్పుడే వారికి తగిన న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అనుసరించే విధానం గురించి మరింత చర్చించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఇట్టి సమావేశంలో కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు ఎన్‌విఎస్ ప్రభాకర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ రెడ్డి, రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ , సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పైడిపెళ్లి సత్యనారాయణ పాల్గొన్నారు.