లక్ష మెజార్టీతో గులాబీ జెండా ఎగురవేస్తాం..!

దిశ, దుబ్బాక:

లక్ష మెజార్టీతో దుబ్బాకపై గులాబీ జెండా ఎగురవేస్తామని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. దుబ్బాకలో స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావన్నారు.

అనంతరం తొగుట మండలం తుక్కపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు రాయి తగిలి మృతి చెందిన సయ్యద్ హుస్సేన్ కుటుంబాన్ని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పరామర్శించారు. బాధితుడి కుటుంబానికి పది వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు.

 

Advertisement