నోముల నర్సింహయ్య లాంటి నాయకుడ్ని కోల్పోవడం దురదృష్టకరం

by Shyam |
TRS state leader Sampath
X

దిశ, హాలియ: డిసెంబర్ 1వ తేదీన జరిగే దివంగత నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రథమ వర్ధంతితో పాటు మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్, నోముల నర్సింహయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నాయకులు, ప్రజలు, శ్రేయోభిలాషులు భారీగా తరలిరావలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సంపత్ కుమార్ కోరారు. శనివారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంపత్ పాల్గొని మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల కోసం నోముల నర్సింహయ్య చివరి వరకు పోరాటం చేశారని గుర్తుచేశారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి అని అన్నారు.

అలాంటి నాయకుడు దూరం కావడం నియోజకవర్గ ప్రజలకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ ఆశీర్వాదంతో హాలియ పట్టణానికి వచ్చిన మా కుటుంబాన్ని అప్యాయాంగా దగ్గరకు తీసుకొని వెంట నడిచి పనిచేశారని గుర్తుచేశారు. 2018లో నాగార్జునసాగర్‌లో జానారెడ్డికి ఎదురెల్లి కాంగ్రెస్ కంచుకోటను పగలగొట్టిన నాయకుడు నోముల నర్సింహయ్య అని అన్నారు. మహానేత మరణాంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ మా కుటుంబంలో భగత్‌కు అవకాశం కల్పించారని వెల్లడించారు. నోముల నర్సింహయ్య యాదవ్, రామ్మూర్తి యాదవ్‌ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. ఈ సమావేశంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story