- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టైం సెన్స్.. టీఆర్ఎస్ సెంటిమెంట్ పాలిట్రిక్స్
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఓ వైపున క్యాంపులు.. మరో వైపున వ్యతిరేక ఓటు డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడ్డ అధికార పార్టీ మరో విషయంలోనూ ఆచూతూచి అడుగేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో టూరిస్ట్ స్పాట్ప్ అన్ని తిరిగి వచ్చిన స్థానిక ఓటర్లు అందరూ కూడా హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే వీరిని గురువారం రాత్రే పోలింగ్ కేంద్రాలకు పంపించేందుకు ఏర్పాటు చేసిన అధిష్టానం చివరి నిమిషంలో పంథా మార్చుకుంది. శుక్రవారం జరగనున్న పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ జరగనున్న నేపథ్యంలో మరో సారి సెంటిమెంట్ పై ఆధారపడ్డట్టుగా తెలుస్తోంది.
దీంతో రాష్ట్రంలో ఏ మూలకూ ఉన్న పోలింగ్ కేంద్రానికైనా ఏడు నుండి 8 గంటల వరకు గమ్య స్థానానాకి చేరే అవకాశం ఉన్నందున అదే అంచనాతో వారిని రిసార్ట్స్ నుండి బయటకు పంపించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్న అధిష్టానం శుక్రవారం ఉదయం 7 గంటలకు క్యాంపుల్లో ఉన్న స్థానిక ఓటర్లను తరలించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. తమ గెలుపునకు మెజార్టీ ఓటింగే కాదు సెంటిమెంట్ కూడా ముఖ్యమని భావిస్తున్న టీఆర్‌ఎస్ అధిష్టానం పోలింగ్ రోజు ఉదయం ముహూర్తం చూసుకునే పంపించాలని భావిస్తోంది. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.