- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గులాబీ పార్టీలో గులాంగిరి.. పైసలుంటనే పదవులు
దిశ, ఆత్మకూర్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసి ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని.. తీరా స్వరాష్ట్రం సాధించుకున్నాక ఉద్యమ పార్టీలో పదవులు ఆశించిన వారికి భంగపాటు తప్పడం లేదు. కొందరు ఏకంగా పార్టీలో కొనసాగలేమని తెగేసి చెబుతున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం. ఇకనైనా మనం పార్టీ కోసం చేసిన సేవలను గుర్తిస్తారన్నా ఆశలు అడియాశలై మిన్నకుండి పోతున్నారు. పరకాల నియోజకవర్గంలో ఈ తంతు స్పష్టంగా కనిపిస్తోంది. ఆత్మకూరు మండలానికి చెందిన నాయకులు కేవలం వారి నాయకుడి చేతుల్లో కీలుబొమ్మలుగా మారారు.ఆయనకు నచ్చిన వారికే పదవులు ఇస్తాడని, పాత కేడర్‌ను పాతాళంలో తొక్కుతున్నారని కొందరు తెరాస నాయకుల మనసులో మాట.
సోషల్ మీడియా వేదికగా నిరసన..
గతంలో జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలలో అహర్నిశలు కష్టపడి తానే అభ్యర్థి అన్న ధోరణితో తిండి, నిద్ర లేకుండా అభ్యర్థుల విజయానికి సర్వ శక్తులు ఒడ్డిన ఓ సీనియర్ నేత వాట్సాప్ వేదికగా తన నిరసన గళాన్ని వినిపించాడు. ఇయనకు దగ్గరగా ఉన్న కొందరు టీఆర్ఎస్ నాయకులకు మండల స్థాయిలో కొన్ని పదవులు ఇచ్చారు. ఆ పదవులు తమకు అనుకూలంగా దక్కలేదని వారి మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ నాయకుడు నాయకుల అభిప్రాయం తీసుకోకుండా పదవుల నియామకం చేపట్టారని, ఇందులో కొందరు సీనియర్ నాయకులకు పదవులు దక్కకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఇద్దరి చేతుల్లోనే పాలన..
ఆత్మకూర్ మండలంలోని కటాక్షపూర్, గూడెపాడ్ గ్రామాలకు చెందిన ఇద్దరు నాయకుల చేతుల్లోనే మండలానికి చెందిన మొత్తం పాలన సాగుతుందని, వారు ఏం చెబితే అది ఎమ్మెల్యే వింటున్నారని సమాచారం. కింది స్థాయి నాయకుల మాటలు పట్టించుకోవడం లేదని కొందరు టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇటీవల జరిగిన గ్రామ స్థాయి, మండల స్థాయి ఎన్నికల్లో వారు చెప్పిన వారికే అధ్యక్ష, ఇతరత్ర పదవులు కట్టబెడుతూ నాయకులు కార్యకర్తల మనోభావాలను దెబ్బతిస్తున్నారని కొందరు టీఆర్ఎస్ నాయకులు చర్చించుకుంటున్నారు. ఇకనైనా నాయకులు, కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతేనే నియోజకవర్గంలో టీఆర్ఎస్ మనుగడ కొనసాగుతుందని ఉద్యమకారులు భావిస్తున్నారు.