- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిరాతకం: టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దారుణ హత్య
దిశ, సూర్యాపేట: టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. అర్ధరాత్రి దారి కాసి కత్తులతో కిరాతకంగా పొడిచి చంపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని రాజానాయక్‌తండాలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం రాజానాయక్ తండాకు చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆదివారం రాత్రి సమయంలో తన సోదరుడి ఇంటినుంచి వెళ్తుండగా.. దుండగులు దారి కాసి కత్తులతో విచక్షణా రహితంగా కడుపు, ముఖంపై కత్తితో దాడి చేశారు. తీవ్రగాయాలై రక్తపు మడుగులో ఉన్న శంకర్ నాయక్‌ను స్థానికులు గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆయన మృతిచెందాడు. కాగా, ఈ హత్యకు పాతకక్షలే కారణమని తండావాసులు అనుమానిస్తున్నారు.
గతంలో ఇదే తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కొందరు మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తుండగా శంకర్ నాయక్ మందలించినట్లు చెబుతున్నారు. అంతేగాకుండా.. వివాహేతర సంబంధాలపై తండాలో జరిగిన పలు పంచాయితీల్లో శంకర్ నాయక్ పెద్ద మనిషిగా వ్యవహరించి యువకులను వార్నింగ్ ఇచ్చి, వివాహేతర సంబంధాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారే హత్య చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యకు ఇదే కారణం కావొచ్చని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.