గ్రేటర్ పోల్స్ పై టీఆర్ఎస్ గురి!

by Shyam |   ( Updated:2020-08-27 01:00:34.0  )
గ్రేటర్ పోల్స్ పై టీఆర్ఎస్ గురి!
X

టీఆర్ఎస్ నాయకుల హడావుడి మళ్లీ కనిపిస్తోంది. కార్యకర్తలు మొదలు కార్పొరేటర్ల వరకు సందడి చేస్తున్నారు. ఇప్పుడే అవసరం లేని పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. సుందరీకరణ పనులపైనా దృష్టి సారించారు. నగరాలను అందంగా ముస్తాబు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పార్కులు, రోడ్లపై నిధులను కుమ్మరించేస్తున్నారు. శిలాఫలకాలు వేసేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

దిశ, న్యూస్ బ్యూరో :

కార్పొరేషన్ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో నగరాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ల పర్యటనలు రోజూ నడుస్తున్నాయి. నాలుగేండ్లుగా సొంత పనులపైనే దృష్టి సారించిన కార్పొరేటర్లు కూడా మళ్లీ ఓటర్లతో వరుసలు కలుపుతున్నారు. పనులు చకచకా నడిపిస్తున్నారు. సమస్యలకు స్పందిస్తున్నారు. వెంటనే సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. కరోనా నేపధ్యంలో జనమంతా భయపడుతున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం నాయకగణానికి జనం మధ్యన తిరగడం అనివార్యమైంది. అధిష్ఠానం, అధికారులు, ఇంటలిజెన్స్ సిబ్బంది సిట్టింగు కార్పొరేటర్లను నిద్ర పట్టకుండా చేస్తున్నారు. ఎక్కడ తమ పనితీరు బాగా లేదని అధిష్ఠానం వరకు చేరుతుందోనని కలవరం మొదలైంది.

అందుకే, నాలుగేండ్లుగా కాలనీ అధ్యక్ష కార్యదర్శులను గుర్తు పట్టనోళ్లు, పది నిమిషాలు సమయం ఇవ్వని కార్పొరేటర్లు.. రావద్దని చెప్పినా వినకుండా కాలనీలు, బస్తీలకు వచ్చేస్తున్నారు. మంత్రి కేటీ రామారావు దృష్టిలో పడేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఆయనే రానున్న ఎన్నికల్లోనూ అభ్యర్ధిత్వాలు ఖరారు చేయనున్నారు. కరోనా సమయంలో నాయకుడొస్తే వెంట పెద్ద ఎత్తున అనుచరగణం వస్తుంది. ఈ క్రమంలో తమకెక్కడ వైరస్ సోకుతుందోనని ఓటర్లు భయపడుతున్నారు. వచ్చే ఏడాది మొదటి తైమాసికంలోనే గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు ఉన్నాయి.టీఆర్ఎస్ పార్టీ ఎత్తుగ డలను ప్రారంభించింది. కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఇంకా ఆ దిశగా అడుగులే వేయడం లేదు.

కసరత్తు ముమ్మరం..

కార్పొరేషన్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇంటలిజెన్స్ సిబ్బందితో కార్పొరేటర్ల పనితీరుపై సర్వే చేయించింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కలిగిన కార్పొరేటర్లకు పనితీరు మెరుగుపర్చుకోవాలని హెచ్చరికలు జారీ అయినట్లు సమాచారం. అవినీతి, అక్రమాల మరకలు అంటినవారు.. అవి వదిలించుకోకపోతే మరోసారి టికెట్టు కష్టమేననే సూచనలు అందినట్లు ప్రచారం జరుగుతోంది. కార్పొరేటర్లు గత ఎన్నికలలో నామినేషన్ తో పాటు జత చేసిన పత్రాలను ఇంటలిజెన్స్ అధికారులు సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

కొంత మంది కార్పొరేటర్ల దగ్గరికి స్వయంగా వచ్చి ఆస్తుల జాబితాలను కూడా తీసుకెళ్లారు. ఎన్నికల్లో పోటీ చేసేటప్పటి ఆస్తులకు, ఇప్పటి ఆస్తులకు మధ్య వ్యత్యాసాన్ని సాకుగా చూపించి టికెట్టు నిరాకరించే అవకా శాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి త్వరలో రూ.200 కోట్లు విడుదల కానున్నట్లు తెలిసింది. తీవ్ర సమస్యలున్న ప్రాంతంలోనే వాటిని ఖర్చు చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఒక్కో కార్పొరేటర్ కు రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు మంజూరు చేస్తారని తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు.

సీఎం హామీలన్నీ పక్కకేనా?

తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ లెక్కకు మించిన హామీలను గుప్పించారు. డల్లాస్, ఇస్తాంబుల్ వంటి నగరాల పేర్లను ప్రస్తావించారు. మీడియా ప్రతినిధులు, అధికారులు కూడా ఆయా నగరాల్లో అభివృద్ధి నమూనాలపై అధ్యయనం చేశారు. అనుకూల మీడియా తెలంగాణ నగరాలు కూడా ఆ నగరాలుగా మారబోతున్నట్లు కథనాలు రాశాయి.

మొన్నటి వానలతోనే ఆ హామీలు ఎక్కడ దాకా వచ్చాయో తేటతెల్లమైంది. ముంపు ప్రాంతాలు అట్లనే కనిపిస్తున్నాయి. మురుగునీటి వ్యవస్థకు మోక్షం లభించలేదు. మంచినీటి వ్యవస్థ మెరుగుపడలేదు. అక్రమాల పునాదులు కాదు.. గోడలు కూడా ఎక్కడా కూలలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాకపోతే రోడ్డు వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు సాగాయి. ఫ్లైఓవర్లు, మల్టీ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల మీద ఆసక్తి కనబరిచారు. మంత్రుల పర్యటనల్లో నగరవాసుల నోళ్లు మూయించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రతిపక్షాలు గొంతెత్తున్నాయి.

డబుల్ బెడ్రూం ఇండ్లే..

మూడు నగరాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లపైనే నెల రోజులుగా మీడియాలో కథనాలు వచ్చేటట్లు చేస్తున్నారు. నిర్మాణంలో అమలు చేసిన సాంకేతిక నైపుణ్యంపైనా కథనాలు రాయిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో డిసెంబరు నెలాఖరుకే 85 వేల ఇండ్లు పేదలకు అందజేస్తామంటూ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించనివే అత్యధికం. చాలా ప్రాం తాల్లో ఇండ్ల కేటాయింపు ప్రక్రియను నిలిపివేశారు. దరఖాస్తుదారుల సంఖ్య చాలా ఎక్కువ. ఎంపిక చేస్తే ప్రభుత్వం, టీఆర్ ఎస్ పట్ల ఇండ్లు రాని వారికి వ్యతిరేకత పెరుగుతుందని భయం పట్టుకున్నది. అందుకే ప్రారంభోత్సవాలతోనే సరిపెడుతున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం టీఆర్ఎస్ బలమే..

Advertisement

Next Story

Most Viewed