కవిత కొత్త స్కెచ్.. ‘జై హనుమాన్‌’తో బీజేపీకి చెక్

by Sridhar Babu |   ( Updated:2021-02-25 10:08:13.0  )
Mlc Kavitha, BJP
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ ఎత్తులను చిత్తు చేసేందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ సరికొత్త ప్లాన్‌తో ముందుకుసాగుతోంది. మాజీ ప్రధాని పీవీ నరసింహరావును బీజేపీ ఓన్ చేసుకునే ప్రయత్నానికి సీఎం కేసీఆర్ చెక్ పెట్టేశారు. తాజాగా బీజేపీకి చెక్ పెట్టేందుకు ఎమ్మెల్సీ కవిత సరికొత్త నినాదంతో ముందుకు సాగబోతున్నామని ప్రకటించారు. గురువారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న దర్శనం చేసుకున్న కవిత, మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి చెక్ పెట్టకనే పెట్టబోతున్నామని సంచలన ప్రకటన చేశారు. ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ పీవీని విస్మరించిందని, మాజీ ప్రధానిని అస్సలు పట్టించుకోవటం లేదని ప్రచారం చేసింది. అంతేగాకుండా కేంద్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా.. పీవీకి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని, భారత తర్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా వినిపించుకోవడం లేదని టీఆర్ఎస్ ఆరోపింస్తోంది. ఈ క్రమంలో పీవీని ఓన్ చేసుకునేందుకు కేసీఆర్ చాణక్య నీతిని ప్రదర్శించి ఆయన కూతురు వాణీ దేవిని ఎమ్మెల్సీ బరిలో నిలిపి అందరికీ షాక్ ఇచ్చారు. తెలంగాణ బిడ్డ అయిన పీవి విషయంలో తామే అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నామన్న సంకేతాలు కూడా పంపించారు సీఎం.

Mlc Kavitha

జై హనుమాన్..

గురువారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇటీవల కాశీ సమీపంలోని హనుమాన్ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఆలయ ప్రముఖులు కొండగట్టు అంజన్న ఆలయ ప్రాశస్త్యం గురించి చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఈసారి చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ జయంతిల సందర్భంగా 41 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. కొండగట్టు ఆలయ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కవిత తెలిపారు.

బీజేపీ ఇస్తున్న జై శ్రీరాం నినాదానికి ధీటుగా టీఆర్ఎస్ పార్టీ ‘జై హనుమాన్’ నినాదాన్ని ఎత్తుకోబోతోందని కవిత ప్రకటనతో స్పష్టం అవుంతోంది. బీజేపీ ఎత్తులను చిత్తు చేసేందుకు టీఆర్ఎస్ ప్రతి అంశంపైనా దృష్టి సారించిందా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

దొంగలమర్రిలో ఎమ్మెల్సీ కవిత డ్యాన్స్.. ఫిదా అవ్వాల్సిందే..!

Advertisement

Next Story

Most Viewed