- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎంఆర్ఎఫ్‌కు విరాళాల వెల్లువ
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీఆర్ఎస్‌కు చెందిన ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటిదాకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాత్రమే విరాళం ప్రకటించగా ఇప్పుడు ఏకంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనంతో పాటు ప్రభుత్వం నుంచి లభించే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభివృద్ధి నిధులను కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని ఆ పార్టీ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెలా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రూ. 2.50 లక్షల చొప్పున వేతనం లభిస్తోంది. ప్రతీ ఏటా మూడు కోట్ల రూపాయల చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధులు లభిస్తున్నాయి. ఇవన్నీ దాదాపు రూ. 400 కోట్ల మేర జమ కానున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు సైతం రెండు నెలల వేతనాన్ని కరోనా కోసం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి, మరో నెల వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి ఇవ్వనున్నట్లు ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష సమావేశంలో నిర్ణయం జరిగింది. దీనికి తోడు వారికి ప్రతీ ఏటా ఎంపీలాడ్స్ కింద వచ్చే రూ. 5 కోట్లను కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికే ఇవ్వాలని నిర్ణయం జరిగింది. ఎంపీలాడ్స్ ద్వారా టీఆర్ఎస్ పార్టీకి చెందిన తొమ్మిది మంది లోక్‌సభ, ఏడుగురు రాజ్యసభ సభ్యులకు రూ. 80 కోట్ల మేర వచ్చే నిధులన్నీ ముఖ్యమంత్రి సహాయ నిధికే వెళ్ళనున్నాయి. ఈ విధంగా ఒక్క రోజే ముఖ్యమంత్రి సహాయ నిధికి దాదాపు రూ. 500 కోట్ల మేర విరాళం పోగైంది.
Tags : Telangana, TRS, MPs, MLAs, MLCs, CMRF, Corona, Donation, MPLAD Funds