- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవు..
దిశ, పటాన్‌చెరు : తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని తెల్లాపూర్, కొల్లూరు వార్డులలో కోటి పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్లను నిర్మించనున్నారు.
సీసీ రోడ్ల పనులకు మున్సిపల్ చైర్ పర్సన్ మల్లెపల్లి లలిత సోమిరెడ్డితో కలిసి శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడంలేదని చెప్పారు.
గత 7 సంవత్సరాల్లో పటాన్‌చెరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని వెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాములు గౌడ్, కమిషనర్ మణికరణ్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.