గట్టిగా హెచ్చరిస్తున్నా.. గట్లనే చేస్తున్రు!

by Aamani |
గట్టిగా హెచ్చరిస్తున్నా.. గట్లనే చేస్తున్రు!
X

దిశ, ఆదిలాబాద్: లాక్ డౌన్ ను పొడిగించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్న ప్రతిసారి ప్రధాని మోడీ నోటి వెంట వస్తున్న ప్రధాన సలహా “దో గజ్ దూర్” అందరి చెవుల్లో గింగుర్లు కొడుతుంటే బాధ్యత గల ప్రజాప్రతినిధులే తుంగలో తొక్కుతున్నారు. దో గజ్ దూర్ (రెండు గజాల దూరం) డిస్టెన్స్ పాటించి కరోనా నివారణకు సహకరించాలని ఎంత మొత్తుకున్నా గులాబీ నేతలకు మాత్రం నెత్తికెక్కడం లేదు.

ఇలా చేస్తే ఎలా..?

నిర్మల్ జిల్లాలో కరోనా సహాయక కార్యక్రమాలతో పాటు, రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలకు హాజరవుతున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని మండల, గ్రామ స్థాయి నేతలు చుట్టుముడుతున్నారు. ఆయనను కలిసేందుకు, ఫొటోలు దిగేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేతల తీరు చూస్తుంటే రెండు గజాల దూరం మాటేమో గానీ…రెండడుగులు కూడా పాటించడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అనేక సందర్భాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ చోటామోటా నేతలను వారించి, గట్టిగా హెచ్చరిస్తున్నా వీరి తీరు మారడం లేదు. నీతులు చెప్పే నేతలే ఇలా వ్యవహరిస్తే సామాన్యుడి పరిస్థితి ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు.

Tags: Adilabad, Minister Indrakaran Reddy, Corona, No Social Distance, Do Ghaz Door, TRS Leaders

Advertisement

Next Story