- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం సభలో సంబంధంలేని వారు..!
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: గల్లీగల్లీ, బస్తీబస్తీ తిరగలేక బడా నాయకులు సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. అసెంబ్లీ ఎన్నికలైతే ఆ నియోజకవర్గ కేంద్రంలో, పార్లమెంట్ ఎన్నికలైతే ఆ కేంద్రంలో సభలు నిర్వహించి అక్కడి ప్రజల పరిస్థితికి అనుగుణంగా నాయకులు మాట్లాడుతారు. కానీ, తెలంగాణలో జరిగే సభలు, సమావేశాలను టీఆర్ఎస్ వినూత్నంగా జరుపుతుంది. సభ, సమావేశం ఏదైనా జనాలు ఉండాల్సిందే. ఆ జనాలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు, మనం ఇచ్చే సందేశం వారికి ఉపయోగం ఉంటుందా అనే ఆలోచన లేదు. జనాలు బాగా వచ్చారని ప్రతిపక్ష పార్టీలు చర్చించుకోవాలి. ఆ ముచ్చట్ల పై రెండు రోజులు చర్చ జరిగి లబ్ది పొందాలని అధికార పార్టీ ఆలోచన. దేంతో సంబంధం లేని ప్రజలను సభకు తరలించిన వైనం నగర ఎన్నికల్లో కనిపించింది.
ప్రతీ డిపో నుంచి 20బస్సులు..
గ్రేటర్ హైదరాబాద్ లోని డిపో బస్సులన్నీ మధ్యాహ్నం 2గంటలకు శివారులోని మున్సిపాలిటీ ప్రాంతాలకు తరలించారు. అక్కడి నుంచి సభకు సంబంధం లేని ప్రజలను మీటింగ్ కు తీసుకొచ్చిన తీరు టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థుల్లో కనిపించింది. సాధారణంగా నగరవాసులు తమ పని ఏందో అదే చూసుకుంటూ ఇంటి నుంచి బయటికి వచ్చే తీరిక ఉండదు. నగరంలోని కొన్ని డివిజన్ లోని స్లమ్ ప్రాంతాల ప్రజలను ప్రలోభ పెట్టి మీటింగ్ కు తరలించడం సాధారణమైన విషయం. కానీ, గ్రేటర్ ఎన్నికల్లో పెట్టిన మీటింగ్ ప్రాంతం నిండిపోవాలంటే ఆ స్లమ్ ప్రజలు సరిపోరు. అందుకోసం నగరానికి సమీపంలో ఉన్న తుర్కయంజాల్, తుక్కుగూడ, అంబర్పేట, జిల్లాలగూడ, ఆదిభట్ల, నార్సింగి, బండ్లగూడ, మీర్పేట్, బడంగ్ పేట్, మణికొండ లాంటి మున్సిపాలిటీ ప్రాంతాల ప్రజలను సీఎం కేసీఆర్ బహిరంగ సమావేశానికి తరలించినట్లు సమాచారం.
ఈ సభ ఎవరి కోసం..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రధాన అంశం. నగరవాసులను ఉద్దేశించి ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన హామీలు, గ్రేటర్ ఎన్నికల్లో గెలిపిస్తే భవిష్యత్లో చేపట్టబోయే హామీలను వివరించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. కానీ, సభతో సంబంధం లేని ప్రజలను తరలించి ఇబ్బంది పెడుతున్నారు. పార్టీ పెద్దల మన్ననలను పొందేందుకు బరిలో నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులు చేసిన నిర్వాహకంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.