- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓటర్లకు స్వీట్ బాక్సులిస్తున్నారు.. అందులో ఇంకేమైనా ఉన్నాయా..?
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ‘స్వీట్ తీసుకోండి.. నోరు తీపి చేసుకోండి.. మా అభ్యర్థికి ఓటెయ్యండి’ అంటూ అధికార పార్టీ నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా జోరుగా స్వీట్ బాక్స్‌ల పేరుతో గిఫ్ట్ బ్యాగుల పంపకాల పర్వం కొనసాగిస్తున్నారు. గద్వాల నియోజకవర్గ ఓటర్లను మభ్యపెట్టే ఈ కార్యక్రమం వారం రోజులుగా జరుగుతున్నట్లు స్వయంగా ఆ పార్టీ నాయకులే చెబుతుండడం గమనార్హం. అయితే ఆ గిఫ్ట్ బాక్స్‌లపై, వాటిని ఇచ్చేందుకు వినియోగిస్తున్న బ్యాగులపై టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ఫొటోతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ప్రధాన నాయకుల ఫొటోలు, గెలిపించాలనే అభ్యర్థను ముద్రించి స్వీట్ పేరిట ఓటర్లకు అప్పజెప్పుతున్నారు. ఈ తతంగం ఎన్నికల నియమావళికి పూర్తి విరుద్ధమని, నిబంధనలు అధికార పార్టీకి పట్టవా? అని పలు పార్టీల నేతలు నిలదీస్తున్నారు. బ్యాగులో స్వీట్లే ఉన్నాయా? లేక ఆ పేరుతో మరెన్ని రకాల మభ్యపెట్టే అస్త్రాలు ఉన్నాయోనని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కూడా ఈ తరహా పంపిణీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కొనసాగింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యహరిస్తున్నారని ఆయా పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.