హుజురాబాద్ కౌంటింగ్.. వెలవెలబోయిన తెలంగాణ భవన్

by Shyam |   ( Updated:2021-11-02 02:16:42.0  )
telangana bhavan
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ఇన్ చార్జులుగా నియమించి విస్తృత ప్రచారం చేయించింది. అయితే ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే ఓట్ల లెక్కింపు రోజు మాత్రం టీఆర్ఎస్ ముఖ్య నేతలుగానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు గానీ పార్టీ ఆఫీసుకు రాలేదు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ముందస్తుగానే పార్టీ నేతలు తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. హడాహుడితో పాటు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంటారు. కానీ, హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతున్నా పార్టీ కార్యాలయం గడప తొక్కలేదు.

ఎప్పుడు సందడి ఉండే పార్టీ కార్యాలయం వెలవెలబోతోంది. ఇంటలిజెన్స్ రిపోర్టు ఆధారంగానే పార్టీ ముఖ్యులు ఎవరూ పార్టీ కార్యాలయానికి రాలేదనే ప్రచారం జరుగుతోంది. కేవలం సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో పాటు మరో ఇద్దరు ముగ్గురు నాయకులు మాత్రమే పార్టీ ఆఫీసుకు వచ్చారు. వారు కూడా టీన్యూస్‌లో ఎన్నికలపై జరిగే చర్చకు వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ టీఆర్ఎస్ భవన్ కార్యకర్తలు లేక వెలవెలబోతోంది.

బీజేపీ కార్యాలయంలో మొదలైన సందడి.. సంబరాలకు రెడీ

సీఎం జగన్ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన వైసీపీ అభ్యర్థి సుధ

Advertisement

Next Story

Most Viewed