- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తీన్మార్ మల్లన్న పై దాడికి యత్నం
దిశ, నిజామాబాద్ :తీన్మార్ మల్లన్నపై కొందరు అధికార పార్టీ నేతలు దాడికి యత్నించారు. ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసులో జారీ అయిన సమన్ల విషయంలో స్టేట్మెంట్ ఇచ్చేందుకు తీన్మార్ మల్లన్న ( చింతపండు నవీన్) వస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీకి చెందిన నేతలు ఆయన పై దాడికి యత్నించారు. ఈ ఘటన ఆదివారం ఇందల్వాయి పోలీస్‌స్టేషన్ సమీపంలో 63వ జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకివెళితే.. హైదరాబాద్ నుంచి ఆర్మూర్ పీఎస్‌కు బయల్దేరిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పై కొంత మంది వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఆర్మూర్‌లో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో అతన్ని ఇందల్వాయి టోల్ ప్లాజా నుంచి ఇందల్వాయి పీఎస్ కు పోలీసులు తరలించారు. పోలీసులు మల్లన్నకు భద్రతగా ఉన్నప్పటికీ కొందరు అతని కారు పై దాడి చేసి ధ్వంసం చేశారు. నవీన్ బయటకు రావాలని కొందరు కారు పై దాడి చేశారు. అనంతరం ఇందల్వాయి పీఎస్‌లో నిజామాబాద్ ఎసీపీ శ్రీనివాస్ కుమార్, ఆర్మూర్ ఎస్సై యాదగిరిల సమక్షంలో మల్లన్న స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణం అయ్యాడు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉద్యేశ పూర్వకంగానే తన అనుచరులతో దాడి చేయించాడని ఇందల్వాయి పీఎస్‌లో తిన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశాడు.