- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి వడ్ల గింజని కొనుగోలు చేస్తాం: వెంకట్రాం నర్సయ్య
దిశ, ఖానాపూర్: పండించిన ధాన్యాన్ని ఒక్కగింజ కూడా వదలకుండా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అనవసరంగా ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తు్న్నాయని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రాం నర్సయ్య అన్నారు. ఓ.డి.సి.ఎం.ఎస్ ఛైర్మెన్ రామస్వామి మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ హయాంలో కంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టామని అన్నారు. 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ లో 6 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల గోదాముల అందుబాటులో ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 14 లక్షలకు పెంచిందని అన్నారు.
రాష్ట్రంలోనే ఉత్తమ సొసైటీ గా అవార్డు తీసుకున్న ఖానాపూర్ సొసైటీని అప్రతిష్ట పాలు చేయడం ప్రతిపక్షాలకు సిగ్గు చేటని విమర్శించారు. ప్రతిపక్షాలు అవకాశవాద రాజకీయాలు చేసి రైతులని ఆందోళనకి గురి చేస్తున్నాయని విమర్శించారు. రైతులు పంట కోనుగోలుకు సంబంధించి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. 18 కొనుగోలు కేంద్రాలలో ,బస్తాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్ రావు,రైతు బంధు కన్వీనర్ కుంచారపు వెంకట్ రెడ్డి,సొసైటీ వైస్ చైర్మన్ వేణు కృష్ణ,డైరెక్టర్ అబోతు అశోక్ తదితరులు పాల్గొన్నారు.