- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అందుకే.. ఎంపీడీవోతో ఎర్రబెల్లి అలా.. మహిళా నేతతో కమిషనర్ ఇలా’
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: దళితుల సాధికారతకు, వారి అభ్యున్నతికై కృషి చేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే టీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ ప్రభుత్వం అదే ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపుతూ కించపరుస్తోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ అవినీతిని ప్రశ్నించిన కౌన్సిలర్ల భర్తలపై కేసులు పెట్టడం, దళిత మహిళా కౌన్సిలర్‌ను కించపరచడాన్ని నిరసిస్తూ తుర్కయంజాల్‌లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున ర్యాలీ, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ నేతల ఆందోళనకు బీజేపీ, బీఎస్సీ నేతలు మద్దతు తెలుపుతూ ఆందోళనలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ తుర్కయంజాల్ మున్సిపాలిటీకి ఇది చీకటి రోజన్నారు. ప్రజాప్రతినిధులు చూపిన సమస్యలను పరిష్కరించడమే అధికారుల పని అని, ఆ సమస్యలను పరిష్కరించాలని కోరిన ప్రజాప్రతినిధులను కులం పేరుతో దూషించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అవినీతిని ప్రశ్నించిన కౌన్సిలర్ల భర్తలపై కేసులు పెట్టడం, మహిళా కౌన్సిలర్‌ను కమిషనర్ అసభ్యంగా దూషించడం దారుణమన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల ఒత్తిడితోనే కమిషనర్ కేసులు పెట్టాడని ఆరోపించారు. దళిత కౌన్సిలర్‌కు క్షమాపణ చెప్పి, కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ దళిత సాధికారత కృషి చేస్తున్నామంటూ ప్రచార ఆర్భాటంలో ఉంటే… పల్లెలు, పట్టణాల్లో మాత్రం దళితులకు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయని విమర్శించారు. వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మహిళా అధికారిణి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే… తుర్కయంజాల్‌లో మహిళా ప్రజాప్రతినిధులను అధికారులు కించపరచడం శోచనీయమన్నారు. కేసీఆర్ ఇచ్చిన అలుసు వల్లే టీఆర్‌ఎస్ పార్టీ నేతలు, అధికార యంత్రాంగం పేట్రేగిపోతోందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ నేతలు, అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇలాంటి చర్యలు విరమించుకోకుంటే టీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్‌రెడ్డి రాంరెడ్డి, చైర్ పర్సన్లు అనురాధ రాంరెడ్డి, ఆర్థిక ప్రవీణ్‌గౌడ్, వైస్ చైర్ పర్సన్ హరితాధన్‌రాజ్‌గౌడ్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కొశికె ఐలయ్య, బీజేపీ ఫ్లోర్ లీడర్ కరాడి శ్రీలత అనిల్‌కుమార్, కౌన్సిలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, జెడ్పీటీసీ భూపతిగళ్ల మహిపాల్, మర్రి నిరంజన్‌రెడ్డి, బీజేపీ నేతలు బీజేపీ ఎస్సీ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బచ్చిగళ్ల రమేష్, తూళ్ల నర్సింహగౌడ్, బీఎస్సీ నేత వద్దిగళ్ల బాబు, పలువురు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మేడం.. బానే ఊపుతున్నావ్! మహిళా ఎంపీడీఓపై ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు