బీజేపీ నేతల్లారా ఖబడ్దార్.. బట్టలూడదీసి తరిమి కొడతాం

by Shyam |   ( Updated:2021-03-15 03:37:00.0  )
బీజేపీ నేతల్లారా ఖబడ్దార్.. బట్టలూడదీసి తరిమి కొడతాం
X

దిశ, మహబూబాబాద్ : రాజకీయంగా ఎదురొస్తే రాజకీయంగానే ఎదుర్కొంటాం.. కాదని రాద్ధాంతాలు చేస్తూ, దౌర్జన్యాలకు పాల్పడితే బీజేపీ నాయకుల్లారా ఖబడ్దార్.. మీ ఒంటి మీద బట్టలూడదీసి తరిమి తరిమి కొడతామని మున్సిపల్ వైస్ ఛైర్మన్ మహ్మద్ ఫరిద్ అన్నారు. ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఎదుగుదలను ఓర్వలేక.. కొంతమంది బీజేపీ నేతలు దిక్కుమాలిన చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పైగాని, టీఆర్ఎస్ గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. ఎమ్మెల్యే సహనం వాహిస్తూ ఓపికగా ఉన్నారని, అందుకే మీకు ఇంకా పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడే అవకాశం కలుగుతుందని తెలిపారు. శంకర్ నాయక్ ఒక్కసారి సైగ చేస్తే అప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాటకి, మీరు చేసే ప్రతి పనికి సమాధానం ఎలా ఉంటుందో ఊహించుకోమని హెచ్చరించారు.

బీజేపీకి టీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేదని, ఆ పార్టీ నేతలకు కనీస రాజకీయ జ్ఞానం కూడా లేదని దుయ్యబట్టారు. ఓపిక పడుతున్నామని.. బీజేపీ నాయకులు ఇటువంటి తప్పుడు చర్యల్ని పునరావృతం చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మార్నేని వెంకన్న, పట్టణ అధ్యక్షులు గద్దె రవి, పార్టీ సీనియర్ నాయకులు పరకాల శ్రీనివాస్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గోగుల రాజు, వార్డు కౌన్సిలర్లు బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed