- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీడియాపై పుట్ట మధు ఫైర్.. ఇన్వెస్టిగేషన్ చేసేది మీరా.. పోలీసులా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఇన్వెస్టిగేషన్ మీడియా చేయాలా? పోలీసులు చేయాలో ఆలోచించుకోవాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. మంథని నియోజకవర్గంలో టీఆర్ఎస్ సభ్యత్వ సేకరణ కార్యక్రమంలో ఆయన మట్లాడారు. మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పుట్ట మధును లోపల వేస్తరా అని కొన్ని టీవీల్లో, పత్రికల్లో రాస్తున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఉన్న రిపోర్టర్లకు సంబంధం లేకుండా హైదరాబాద్ లో ఉన్న వాళ్లు ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారని ధ్వజమెత్తారు. కొన్ని సంస్థలు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు అమ్ముడుపోయి బీసీ బిడ్డనైన తనను టార్గెట్ చేశాయని పుట్ట మధు ఆరోపించారు. త్వరలో హైదరాబాద్ లో మీటింగ్ ఏర్పాటు చేసి మీడియా బండారం అంతా బయటపెడతానని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్, కేటీఆర్ ల అపాయింట్ మెంట్ అడిగితే నిరాకరించారని, తానసలు మంథనిలోనే లేనని కొన్ని పత్రికలు రాశాయన్నారు. ఇన్వెస్టిగేషన్ అయిన తరువాత స్పందించాలని అనుకున్నాను కానీ నేను మహదేవూర్ ప్రాంతంలో తిరుగుతుంటే ఇక్కడ లేనని రాశారని ఏమైనా మెదడు ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు. మీ రేటింగ్స్ కోసం, మీ ప్రచారం కోసం గరీబు బిడ్డనైనా నాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇన్వెస్టిగేషన్ కోసం హైకోర్టులో అప్లికేషన్ పెట్టుకుని మీడియా వాళ్లు దరఖాస్తు చేసుకోండన్నారు. 70 ఏళ్లలో ఓ బీసీ వాడు ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ కావడం ఏందీ? దీనిని మేం సహిస్తలేం? అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంథని నుండి ఒక్కసారి మాత్రమే పెద్దపల్లికి వెళ్లానని, మీడియాను చూస్తే ఒక ఆలోచన కలగాలి, ఒక ధైర్యం కలగాలన్నారు. కానీ నేడు మీడియాను చూస్తే అసహ్యం వేస్తోందని, ఎందుకు నాపై ఇంత కుట్ర, ఎందుకు నాపై ఇంత పగ అంటూ పుట్ట మధు ప్రశ్నించారు.
ఎమ్మెల్యేను ఇక్కడ ఓడగొట్టి మా పార్టీని నిలబెట్టుకుంటున్నాం, ఇన్వెస్టిగేషన్ కానివ్వరా, ఎంక్వైరీ జరగనివ్వారా ఎవరు తప్పు చేస్తే వాళ్లు లోపలకు పోరా అని అడిగారు. ఎందుకింత దౌర్జన్యం చేస్తున్నారు నాపై, మీ బ్రేకింగ్‌ల కోసం, మీ ప్రచారం కోసం గరీబ్ బిడ్డను బద్నాం చేస్తున్నారని మధు అన్నారు. నేను వజ్రాన్ని.., మోసగాన్ని కాదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పోరాటం ఆగేది లేదని, నా ప్రజల కోసం మాత్రమే ఉంటా మోసగాళ్ల కోసం ఉండనన్నారు. నా పిల్లలు స్థిరపడ్డారు ప్రజలు, టీఆర్ఎస్ కోసం నేను, నాభార్య జీవితం అంకితమని అన్నారు.