ఏడేళ్లలో ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు :చాడ వెంకటరెడ్డి

by Shyam |
ఏడేళ్లలో ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు :చాడ వెంకటరెడ్డి
X

దిశ, హుస్నాబాద్: ఏడేళ్లలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో ఏర్పాటు చేసిన నియోజవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలని పలు రాష్ట్రాలు ఉద్యమాలు చేస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం తమ వైఖరి ఏంటో ప్రజలకు చెప్పట్లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతోందన్నారు. సంక్షేమ పథకాల ప్రవేశపెట్టినం అని గొప్పలు చెప్పుకోవడమే కానీ వాటికి నిధుల కేటాయింపుల్లో మాత్రం జాప్యమెందుకని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి సైట్ ద్వారా భూ సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయని వాటిని పరిష్కరించడంతో ప్రభుత్వం విఫలమైందన్నారు.

రాబోయే 2023 ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 20 నియోజవర్గాల్లో సీపీఐ పోటీ చేసేందుకు దృష్టి పెట్టిందన్నారు. కమ్యూనిస్టుల కంచుకోట హుస్నాబాద్ నియోజవర్గానికి పూర్వవైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రజా సమ్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఉద్యమాలు నిర్వహించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతంతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ బరిలో ఉంటుందని తెలిపారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుండే పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed