- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి ఇలాఖాలో టీఆర్ఎస్‌కు బిగ్ షాక్
దిశ, జల్‌పల్లి: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజక వర్గమైన మహేశ్వరంలోని జల్‌పల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలయ్యింది. జల్‌పల్లి మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ బుడుమాల యాదగిరి పార్టీకి రాజీనామా చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం దాదాపు 200 మందితో యాదగిరి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 16వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచి 18 నెలలు గడుస్తోందని, తాను అధికార టీఆర్ఎస్‌లో ఉన్నా.. కనీసం ఒక్క అభివృద్ధి పని కూడా జరుగలేదని కౌన్సిలర్ యాదగిరి ఆరోపించారు. 16వ వార్డు అభివృద్ధికి మంత్రితో పాటు స్థానిక టీఆర్ఎస్ నేతలు, అధికారులు ఎవ్వరూ సహకరించక పోవడమే కాకుండా ఏ పని చేద్దామన్నా అడ్డుపడుతున్నారని, అందుకే పార్టీ మీద విరక్తి చెంది రాజీనామా చేస్తున్నట్లు యాదగిరి చెప్పారు.
స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన యాదగిరి..
కౌన్సిలర్ యాదగిరి మంత్రి సబితాఇంద్రారెడ్డి కన్నా ముందే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. 2020లో జల్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో 16వ వార్డు కౌన్సిలర్ టికెట్ తనకు ఇవ్వాలని దాదాపు 500 మంది కార్యకర్తలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వేడుకున్నట్లు చెప్పారు. ‘‘కాళ్ళు మొక్కినా మేడమ్ కరిణించలేదు’’ అని యాదగిరి వాపోయాడు. దీంతో 2020 జల్‌పల్లి మున్సిపాలిటీ 16వ వార్డు నుంచి యాదగిరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీటీసీ యాంజల జనార్దన్‌పై 179 ఓట్లతో గెలుపొంది సత్తా నిరూపించాడు. అనంతరం తరువాతి పరిణామాల మూలంగా టీఆర్ఎస్‌లో చేరాడు. మంత్రి చెంతన టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ 16వ వార్డులో టీఆర్‌ఎస్ పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. అక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మరో వర్గానికే మంత్రి పెద్దపీఠ వేస్తున్నారని, కౌన్సిలర్‌గా గెలిచినా తనకు ప్రయోజనం లేకుండా పోయిందని యాదగిరి ఆవేదన వ్యక్తం చేశాడు. గెలిచి సంవత్సరంన్నర అవుతున్నా.. ఒక్కరూపాయి పని కూడా చేయనివ్వడం లేదని, తాను ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. ప్రజల అవసరాలకే పార్టీ నుంచి బయటికి వచ్చానని, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరకు పోరాడి నిధులు తీసుకువచ్చి 16 వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీరిచిదిద్దుతానన్నారు. త్వరలోనే నా అనుచరులు, గ్రామస్థులతో కలిసి తీసుకున్న నిర్ణయం మేరకు ఏ పార్టీ అని భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్థానాన్ని యాదగిరి చెప్పారు. కౌన్సిలర్ రాజీనామాతో టీఆర్‌ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో వేచిచూడాల్సిందే.?