- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం
దిశ, రంగారెడ్డి: షాద్‌నగర్ పట్టణ ప్రగతి అభివృద్ధిపై మున్సిపాలిటీ అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంధ సంస్థల నాయకులు హాజరై పట్టణ సమస్యలపై ప్రసంగించారు. అందులో భాగంగానే కాంగ్రెస్ నేత బాబర్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై, ప్రజా సమస్యలపై ప్రశ్నించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో షాద్‌నగర్ పట్టణ అభివృద్ధి కుంటుపడిందని బాబర్ వాఖ్యనించారు. గత మున్సిపాలిటీ చైర్మన్ హాయంలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో కోట్లాది రూపాయల నిధులు వెనక్కి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంపీటీసీగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు నగరంలో దర్శనం ఇస్తున్నాయన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పట్టణ ప్రగతి కోసం రూ. 50 కోట్ల నిధులు ప్రకటించారని, ఆ నిధులు ఏమయ్యాయని బాబర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్‌ను నిలదీశారు. దీంతో ఆగ్రహించిన స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కాంగ్రెస్ నేత బాబర్ పై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే ఆగ్రహానికి బాబర్ స్పందించి… నాది తప్పని నిరూపిస్తే నేలకు ముక్కురాస్తానని సవాల్ విసిరారు.
Read also..